close
eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

Civil Services Exam Preparation Plan

యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష మొత్తం 3 దశల్లో జరుగుతుంది.
1. ప్రిలిమ్స్
2. మెయిన్స్
3. ఇంటర్వ్యూ
ఈ మూడు దశలకు ఎలా సిద్ధం కావాలో తెలుసుకోవాలంటే .... క్లిక్ చేయండి.

Civil Services Exam Preparation Plan

సివిల్స్‌పై అభిరుచి, సామర్థ్యాల తీరు అభ్యర్థుల్లో ఏ విధంగా ఉందో సాధారణంగా మెయిన్‌ పరీక్షలో, మౌఖిక పరీక్షలో పరీక్షిస్తుంటారు. ఇటీవల జరిగిన ప్రిలిమినరీ (ప్రాథమిక) పరీక్షలో వీటిని పరీక్షించే ప్రయత్నం జరిగింది. ఈ ప్రశ్నపత్రాన్ని విశ్లేషించి గ్రహించాల్సిన అంశాలను పరిశీలిద్దాం!
వూహించినట్లుగానే ప్రిలిమినరీ-2013 పరీక్ష రాసినవాళ్ళ సంఖ్య తగ్గింది. హైదరాబాద్‌ నుంచి 38,000 మందికిపైగా దరఖాస్తు చేసినప్పటికీ 16,500 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సుమారు 20000 మంది రాసివుంటారని అంచనా.
ఈ పరీక్షలో అర్హత పొంది మెయిన్స్‌ రాయటానికి జనరల్‌ కేటగిరి అభ్యర్థులు తెచ్చుకోవాల్సిన మార్కుల కటాఫ్‌ 219-225గా ఉండొచ్చు. ఓబీసీ వారికి ఇది 205-210 మార్కులుగా, ఎస్‌సీ వారికి 195-200 మార్కులుగా, ఎస్‌టీ వారికి 185-190 మార్కులుగా ఉంటుందని అంచనా.