Article

EDP

C & DS

Engg.Chemistry

Engg.Physics'సి' భాషలో మెలకువలు ఎలా?
 • ప్రోగ్రామింగ్ భాషలో పట్టు సాధించటంపై ఇంజినీరింగ్ విద్యార్థులకు స్పష్టత అవసరం. 'మొదట ప్రాథమికాంశాలను (బేసిక్స్) తెలుసుకోవటం, వాటితో కొన్ని సమస్యలను వాస్తవ దృక్పథం నుంచి పరిష్కరించగలగటం అలవాటు చేసుకోవాలి.
  గడిచిన రెండు దశాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా 'సి' ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పొందిన ప్రాచుర్యం మరే భాషా పొందలేదు. 'సి' భాష సాఫ్ట్‌వేర్ పరిశ్రమ స్వరూపాన్నే మార్చేసింది. ఇప్పుడు వాడుకలో ఉన్న యునిక్స్ (Unix) ఆపరేటింగ్ సిస్టమ్‌లో 90% 'సి' భాష ఉపయోగించి రాసిందే. 'సి' భాషలో ఆదేశాలను (instructions) రాయడానికి కొన్ని నియమ నిబంధనలు (syntax and semantic rules) ఉన్నాయి. వాటి ప్రకారమే మనం ఆదేశాలను రాయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను సంపూర్ణంగా నేర్చుకోగలిగితే 'సి' ప్రోగ్రామ్స్ రాయడం చాలా సులువు.

  ఏ ప్రోగ్రామింగ్ భాష కయినా కావల్సింది తార్కికంగా ఆలోచించి సమస్యల్ని పరిష్కరించడం. దీనికి 'సి' భాష మినహాయింపు కాదు. ప్రోగ్రామింగ్ భాషలో పట్టు సాధించాలంటే మొదట తాము తెలుసుకున్న ప్రాథమికాంశాల (బేసిక్స్)తో కొన్ని సమస్యలను వాస్తవ దృక్పథం నుంచి తీసుకొని పరిష్కరించగలగాలి. కాబట్టి ఏ కంప్యూటర్ సబ్జెక్టును అయినా నేర్చుకోవాలంటే యాభై శాతం పుస్తకాలు ఉపయోగపడతాయి; మిగతా యాభై శాతం కంప్యూటర్ మీద అభ్యాసం తప్పనిసరిగా ఉండాల్సిందే.
  ముఖ్యంగా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ప్రవేశించిన విద్యార్థులు ప్రారంభం నుంచి ప్రాథమికాంశాల మీద శ్రద్ధ చూపాలి. తాము చదివింది ఎప్పటికప్పుడు కంప్యూటర్‌పై సాధన చేయడం చాలా అవసరం.

  సాధన చివర్లో చేసేది కాదు
  సాధన అనేది పరీక్షకు ఒకరోజు ముందు చేసేది కాదు. మొదటి రోజు నుంచీ దాన్ని అవలంబించాలి. మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు వార్షిక పరీక్షల ముందు మూడు Internal Exams ఉంటాయి.
  ఒక్కో పరీక్ష 25 మార్కులకు ఉంటుంది. అందులో రాత పరీక్షకు 10 మార్కులు, ఆబ్జెక్టివ్ పరీక్షకు 10 మార్కులు, అసైన్‌మెంట్‌కు 5 మార్కులూ ఉంటాయి. 'సి' భాష వార్షిక పరీక్ష సరిగా రాయాలంటే దానికి ముందున్న మూడు ఇంటర్నల్ పరీక్షలకు ప్రణాళికబద్ధంగా సాధన చేస్తే సరిపోతుంది.

  ఈ సూచనలు పాటించండి!
  'సి' ప్రోగ్రామింగ్ భాష వార్షిక పరీక్షలో విజయం సాధించాలంటే ఈ కింది సూచనలు తప్పక పాటించడం మేలు.
  Study the basic concepts
  మొదటగా ప్రాథమికాంశాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఇందుకు వివిధ రచయితలు రాసిన పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా 'సి' ప్రోగ్రామింగ్ భాష కోసం కింది పుస్తకాలు ఉపయోగపడతాయి.
  1. "Programming in ANSI C" by E. Balaguru Swamy
  2. "Let us C" by Yashwant Kanethkar
  3. "C Programming & Data Structures" by Foroazan Behrouz
  ఇవి చదవడం ద్వారా 'సి' భాషా పరిజ్ఞానం ఏర్పడుతుంది. 'సి' భాషకు సంబంధించిన అన్ని ప్రాథమిక అంశాలూ ఈ పుస్తకాల్లో లభిస్తాయి. Data types, loops, Arrays, functions, pointers and files పై అవగాహన పెరుగుతుంది. చదివిన ముఖ్యమయిన విషయాలను ఒకచోట రాసుకోవాలి. అలాగే వాటిని పుస్తకాల్లో అండర్‌లైన్ చేసుకోవాలి. వీలయితే ఫ్లాష్ కార్డులు తయారు చేసుకోవాలి. ఇలా చేస్తే పరీక్ష ముందు ముఖ్యమైన విషయాలు చదవటం తేలికవుతుంది.
  * Practice, Practice and Practice
  వీలైనంతవరకు ఎక్కువ ఉదాహరణలను కంప్యూటర్‌పై సాధన చేయాలి. ముఖ్యంగా Arrays, strings, structures, functions and pointer concepts పై ఎంత ఎక్కువ సాధన చేస్తే పరీక్షల్లో అంత మంచిది. ఏ రోజు చదివినవి ఆ రోజే కంప్యూటర్‌పై సాధన చేస్తే చక్కగా అర్థమవుతుంది. కేవలం పాఠ్యపుస్తకంలోని ఉదాహరణలే కాదు; కొన్నిReal time practical problems ని తీసుకొని వాటిని సొంతంగా ఛేదించి దానికి సమాధానం కనుక్కోగలిగితే 'సి' భాషలో వున్న అన్ని భావనలపై పూర్తి అవగాహన వస్తుంది.
  * Refer previous Question papers
  వార్షిక పరీక్షలకు ముందు, ఇంటర్నల్ పరీక్షలకు ముందు విద్యార్థులు previous years Questions papers ని పరిశీలించాలి. ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ప్రశ్నపత్రం స్వరూపం ఎలా ఉంటుంది, ఏఏ విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపాలి అనేవాటిపై అవగాహన వస్తుంది. అందుకే వీలైనన్ని ఎక్కువ ప్రశ్నపత్రాలను సేకరించి వాటికి సమాధానాలు కనుక్కోవడం చేయాలి. తద్వారా 'సి' భాష వార్షిక పరీక్షపై ఉండే భయం తొలగిపోతుంది; ప్రశాంతంగా సాధన చేయగలుగుతాము.

  - D. Vijay Kumar

  Asst. Prof., Dept IT

  MGIT, Hyd

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning