ఇంటర్న్‌షిప్‌ ఎందుకు?

ఇంటర్న్‌షిప్‌ అనేది ఒక విద్యార్థి తరగతిలో ఉండే సిలబస్‌ కాకుండా పరిశ్రమలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చేసేది.

కళాశాలలో చదివినవి నిజంగా పరిశ్రమలో ఎలా వినియోగిస్తారో తెలుస్తుంది.

అనుభవజ్ఞులైనవారిని మార్గదర్శి (గైడ్‌)గా పొందే అవకాశం.

ఎంచుకున్న రంగం ఎలా ఉంటుందో అవగాహన వస్తుంది.

ఆ రంగంలో నెట్‌వర్క్‌, రిఫరెన్సెస్‌ పెంచుకోవచ్చు.

సీవీని ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుస్తుంది.

అదే కంపెనీలో ఉద్యోగం సంపాదించే అవకాశం కూడా లేకపోలేదు.

ఇంజినీరింగ్‌ పూర్తయ్యేసరికి పై విధంగా తెలుసుకుని ఉంటే ఉద్యోగం/పరిశ్రమకు మీరు సిద్ధంగా ఉన్నట్లే. దీనికి మొదటి సంవత్సరం నుంచే సిద్ధం కావాలి. గచ్చిబౌలి, హైదరాబాద్‌లో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ వాళ్ళు ఫైబర్‌ ఆప్టిక్స్‌ శిక్షణ http://goo.gl/lg9D9 కోర్సు అందిస్తున్నారు.

అలా కాకుండా బ్లాగ్‌ ప్రారంభించి నచ్చిన అంశంపై రాస్తూ ఉండొచ్చు కూడా. ఇక ఎప్పటికప్పుడు తాజా అంశాలపై అవగాహన (అప్‌డేట్‌) కోసం గూగుల్‌ అలర్ట్‌ ఉండనే ఉంది. ఇంటర్న్‌షిప్‌ 24x7 ఎప్పుడైనా చేయవచ్చు. కనుక బ్లాగ్‌ లాంటి ప్రొఫైల్‌ చూపిస్తే ఇంటర్న్‌షిప్‌ లాంటివి సంపాదించడం సులువు. బెంగళూరు నుంచి బోస్టన్‌ వరకూ ఎవరినైనా కలుసుకోవచ్చు. Internshala, SiliconIndia లాంటి వెబ్‌సైట్స్‌లో ఇంటర్న్‌షిప్‌ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి తెలుసుకోవచ్చు. http://barcamp.orgవెబ్‌సైట్‌ని అనుసరిస్తూ వివిధ ప్రదేశాల నుంచి వివిధ రకాల వృత్తినిపుణులను (ప్రొఫెషనల్స్‌) కలుసుకుంటే ప్రయోజనం.