సంస్థలను ఇలా సంప్రదించాలి

మీ స్కిల్‌కు తగిన కంపెనీలను గూగుల్‌ అలర్ట్‌ ద్వారా తెలుసుకుని, తర్వాత మొదటి లక్ష్యం ఆ సంస్థ నుంచి ఇంటర్వ్యూ (సేల్స్‌) కాల్‌ రావడమే అయివుండాలి. ఆ కంపెనీ బిజినెస్‌ లక్ష్యం ఏమిటనేది తెలుసుకోవాలంటే ఆ కంపెనీ సీఈఓ ఎవరు, ఎందుకు, ఎలా మొదలుపెట్టారో తెలుసుకోవాలి.

వారు ఎప్పుడూ ఈ బిజినెస్‌ను ఇంకా అభివృద్ధి చేయాలని చూస్తూవుంటారు కాబట్టి ఆ సంస్థ వివరాలు తెలుసుకోడానికి వాటి గ్రంథాలయం, ఉద్యోగులు, వార్షిక నివేదికలు, స్టోర్స్‌, ఉత్పత్తులు, పూర్వ ఉద్యోగులు, డేటాబేస్‌ ఇంటర్నెట్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌... ఇలా వివిధ ఆధారాలు ఉండనే ఉన్నాయి. ఇలా పరిశోధిస్తూవుంటే ఆ కంపెనీకి ఉన్న సవాళ్ళు, అవకాశాలు, సృజనాత్మక ఆలోచనల గురించి మీకు చాలా విషయాలు తెలుస్తాయి.

ఇలా తెలుసుకున్న తర్వాత మీరు ఆ కంపెనీకి మీకిష్టమైన పనులను బాధ్యతగా నిర్వహిస్తామని ఒక ఈ-మెయిల్‌ పంపండి. సీవీ మాత్రమే కాకుండా బ్లాగ్‌ లింక్‌ ఈ మెయిల్‌లో జత చేస్తూ హెచ్‌ఆర్‌ అనే కాకుండా, సరైన టెక్నికల్‌/హైరింగ్‌/ప్రాజెక్టు మనేజర్‌కి పంపండి. తర్వాత ఫోన్లో మాట్లాడి, ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ తీసుకుని వెళ్ళండి. ఇలా నేరుగా కంపెనీలను సంప్రదిస్తే ఉద్యోగ సాధనకు చేరువవుతారు.