వాయిదా.. వాయిదా!

Procrastination:పనులను అనుకున్న సమయంలో చేయకుండా 'తర్వాత చేద్దాంలే' అనుకుంటూ దాన్ని వాయిదా వేయడం. దీనివల్ల ఉద్యోగులూ, వ్యాపారవేత్తలతో పాటు విద్యార్థులు కూడా తమ సమయాన్నీ, ప్రతిభా సామర్థ్యాలనీ కోల్పోతుంటారు. కింది చిట్కాలు పాటిస్తే దీన్నుంచి బయటపడొచ్చు.

* 'ఈ ముఖ్యమైన పనిని ఈపాటికే నేను చేసివుండాల్సింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలి' అనుకుంటూ ఆ పనిని ముగించాలి.

* ఏవేవి ఎప్పుడెప్పుడు చేయాలో సమయ ప్రణాళిక వేసుకుని, దాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి.

* 'తప్పలేక ఈ పనిచేస్తున్నా' అని కాకుండా 'ఇది ఇష్టపడి చేస్తున్నా' అనే భావనతో చేయాలి.

* పెద్ద ప్రాజెక్టును/ పనిని చిన్నచిన్న భాగాలుగా విడగొట్టాలి. ఇలా చేస్తే 'ఇంత పెద్దపని చేయగలనా?' అనే భయం పోతుంది.

* ఒత్తిడి ప్రభావం లేకుండా అవసరమైనపుడు విశ్రాంతి తీసుకోవచ్చు.

* మొత్తం భారం మీద వేసుకోకుండా, వీలైతే ఇతరులతో ఆ పనిని పంచుకోవడం మంచిది.

* మనలను మనం పూర్తిగా నమ్మాలి. 'నేను చేయగలను, చేస్తాను' అనే భావన పెంచుకోవాలి.