ఉద్యోగం సాధించాలంటే...

* దాగివున్న ఉద్యోగావకాశాలను వెతికి పట్టుకోవాలి. చాలాసార్లు సంస్థలు అంతర్గతంగా లేదా తమ పరిధిలోనివారికి తెలియపరుస్తూ ఖాళీలను భర్తీ చేస్తుంటాయి. ఇలాంటివి తెలుసుకోవాలంటే మంచి నెట్‌వర్క్‌ రూపొందించుకోవాల్సిందే.

* ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ పెంచుకోండి. తద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూనే ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలున్నాయో తెలుసుకోవచ్చు.

* సీవీని జాబ్‌ పోర్టల్‌లో పెట్టి ఊరుకోవటం కాకుండా బ్లాగ్‌, లింక్‌డిన్‌ లాంటి సోషల్‌ మీడియాసైట్స్‌లో మీ ప్రొఫైల్‌ పెట్టండి. మీ ఇష్టాలూ, నైపుణ్యాలను సరైన కీలకపదాలతో (కీ వర్డ్స్‌) వ్యక్తపరుస్తూ ఉండండి.

* మీకు సరిపడే, ఇష్టమైన సంస్థలను ఎంచుకోండి. వాళ్లకి మీరు ఎలాంటి పని చేయగల్గుతారో తెలుసుకోండి. కెరియర్‌ ఆరంభంలో చిన్న చిన్న కంపెనీల్లో చేయడం ఎంతో మేలు.

* మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మండి. ఒకసారి వెళ్లిన ఇంటర్వ్యూలో ఎంపిక కాకపోయినంత మాత్రాన దిగులు పడనవసరం లేదు. ఆ ఇంటర్వ్యూలో మీరు ఎక్కడెక్కడ సరిగ్గా చెప్పలేకపోయారో ఆలోచించి.. అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇలా ప్రతి ఇంటర్వ్యూ నుంచీ ఎంతో నేర్చుకోవాల్సివుంటుంది..