దరఖాస్తు ఎవరెవరికి?

అభ్యర్థులు సాధారణంగా మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌) వారికి ఉద్యోగ దరఖాస్తును పంపి ఊరుకుంటారు. కానీ అది సరిపోదు. వారు సాంకేతిక లేదా హైరింగ్‌ మేనేజర్‌ను కూడా సంప్రదిస్తే ఎక్కువ మేలు జరుగుతుంది.

* హెచ్‌ఆర్‌ వారికి సాధారణంగా తమ బృందంలోకి ఇతర హెచ్‌ఆర్‌ సిబ్బందిని తీసుకోవడానికే ఎక్కువ అర్హత ఉంటుంది.

* మార్కెటింగ్‌, ఇంజినీరింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌, అకౌంటింగ్‌ మొదలైనవాటిలో వారికి తగినంత ప్రావీణ్యం ఉండదు.

* అందుకే హెచ్‌ఆర్‌ వారు కేవలం మీ సీవీని ప్రాసెస్‌ చేస్తారు కానీ, మిమ్మల్ని తీసుకోవాలో, తీసుకోకూడదో నిర్ణయించలేరు.

* కేవలం సీవీ ద్వారా మీ నైపుణ్యం వారు గుర్తించలేకపోవచ్చు. సీవీలో మీరు పొందుపరిచిన వివరాలు చూసి, కొన్నిసార్లు మీ సీవీని పక్కనపెట్టవచ్చు కూడా.

అందుకే సామాజిక అనుసంధాన వేదిక (లింక్‌డిన్‌) ఉపయోగించి ెక్నికల్‌/ప్రాజెక్టు/హైరింగ్‌ మేనేజర్‌ గురించి సమాచారం సేకరించి, వారిని సంప్రదించటం మేలు.