క్యాంపస్‌ నుంచి... నేరుగా!

సాధారణంగా తాజా గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌కి సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు ఉండవు.

* కళాశాల నుంచి బయటికి వచ్చాక ఉద్యోగవేట ఎలా చేయాలో తెలియని వాళ్లు ఎందరో ఉంటారు. దీనికి ముఖ్య కారణం కళాశాలలు విద్యార్థులకు దీనిపై తగిన అవగాహన కల్పించకపోవటం.

* తక్కువ ఖర్చులోనే శిక్షణ తీసుకుని ఉద్యోగం చేయగలవారంటేనే సంస్థలు సుముఖత చూపుతాయి.

* మొదటగా మీరు ఎంచుకున్న రంగంలో ఎలాంటి సంస్థలు ఉన్నాయో తెలుసుకోవాలి.

* నెట్‌వర్క్‌ పెంచుకుంటూ రిఫరెన్స్‌లు సంపాదించుకోండి. తద్వారా మీరు నేరుగా ప్రాజెక్ట్‌/టెక్నికల్‌/హైరింగ్‌ మేనేజర్‌ను సంప్రదించవచ్చు.

* మీకు తగిన అనుభవజ్ఞులైన మెంటార్‌/గైడ్‌/కోచ్‌ని ఎంచుకొని వారి సలహాలు తీసుకుంటూ ఉండండి.

* లింకెడిన్‌, ఫేస్‌బుక్‌, బ్లాగ్‌లలోని మీ ప్రొఫైల్‌ వెబ్‌లింక్‌ని CVలో జతచేస్తూ దరఖాస్తు చేయండి.

* హాజరైన ఇంటర్వ్యూల్లో మీ లోపాలను పరిశీలించుకుని సంబంధిత నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉండండి