మీలోని ప్రతిభను గుర్తించడం ఎలా?

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దానిని గుర్తించటం ముఖ్యం. కింది మెలకువల ద్వారా మీ ప్రతిభను గుర్తించడానికి ప్రయత్నించండి.
* ఇప్పటికే మీ కుటుంబ వ్యక్తులు, స్నేహితులు మిమ్మల్ని చాలాసార్లు మీ ప్రత్యేకతలను మెచ్చుకునివుంటారు. వాటిని గుర్తు చేసుకోండి.
* చేసే పనుల్లో చాలా అవలీలగా ఏది చేస్తున్నారో గుర్తించండి.
* అలా చేసేటపుడు దేనిని బాగా ఇష్టంగా చేస్తూ ఆనందిస్తున్నారో గమనించండి.
* మీరు ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉంటారు. అవేమిటో వెలికి తీయండి.
ఇలా మీరు చేసిన ప్రతి పనికీ మీ సన్నిహితుల నుంచి వచ్చే స్పందనను గమనిస్తూ మీ ప్రతిభ దేనిలో దాగివుందో గుర్తించవచ్చు.