How to Register in www.eenadupratibha.net
రిజిస్ట్రేషన్ విధానం:
* రిజిస్ట్రేషన్ చేసుకొనేవారికి ఈ-మెయిల్ఐడీ తప్పనిసరిగా ఉండాలి.
* ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పటికీ లాగిన్ కావచ్చు.

Steps:
1. హోంపేజీలోని 'LOGIN' పక్కన ఉన్న 'New User' బటన్ క్లిక్ చేయాలి.


2. అప్పుడు 'User Registration' విండో ఓపెన్ అవుతుంది.


3. రిజిస్ట్రేషన్‌లో అడిగిన వివరాలను సక్రమంగా నమోదుచేయాలి. ఈ-మెయిల్ఐడీని తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీ ఈమెయిల్ఐడీనే వెబ్‌సైట్‌లోకి ప్రవేశించడానికి 'యూజర్ ఐడీ'గా ఉపయోగపడుతుంది.
4. మీరు రెగ్యులర్‌గా ఈమెయిల్‌కి ఉపయోగించే పాస్‌వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన, సులభంగా గుర్తుండే మరో పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి.'Confirm Password' లో కూడా మీరు పైన ఇచ్చిన పాస్‌వర్డ్‌నే మళ్లీ ఎంటర్ చేయాలి.
5. 'వెరిఫికేషన్ కోడ్' కోసం కింద ఇచ్చిన బాక్స్‌లోని అక్షరాలను జాగ్రత్తగా చూసి టైప్ చేయాలి.
6. అన్ని బాక్సులు నింపిన తర్వాత 'Save' బటన్ పై క్లిక్ చేయాలి.


7. అప్పుడు 'thanks for registration' అనే మెసేజ్ డైలాగ్ బాక్స్ వస్తేచాలు 'Ok' బటన్ క్లిక్ చేసి వెంటనే లాగిన్ కావచ్చు.
8. రిజిస్ట్రేషన్ పూర్తవగానే యూజర్ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు మీ ఈమెయిల్‌కు చేరతాయి. మీరు మళ్లీ ఈమెయిల్ ఓపెన్ చేసి యాక్టీవేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ వివరాలు మీ ఈమెయిల్‌కి రావడం ఆలస్యమైనా వేచి చూడాల్సిన పనిలేదు. వెంటనే లాగిన్ కావచ్చు.



9. 'Login' పక్కన ఉన్న బాక్సు (Enter your registered email id)లో మీ ఈమెయిల్ఐడీని (ఇదే యూజర్ ఐడీ) టైప్ చేయాలి.
10. దాని పక్కనే ఉన్న బాక్స్‌లో లాగిన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన పాస్‌వర్డ్ టైప్ చేసి 'Login' పై క్లిక్ చేస్తే మీరు వెబ్‌సైట్‌లోకి ప్రవేశిస్తారు.



Note: మీ ఈమెయిల్ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యాక వెబ్‌సైట్‌లోని అన్ని విభాగాలను చూడవచ్చు.
పాస్‌వర్డ్ మర్చిపోతే....
*ఒకవేళ పాస్‌వర్డ్‌ను మరిచిపోయినట్లయితే 'Login' లో ఉన్న 'Forgot Password' పై క్లిక్ చేస్తే చిన్న విండో ఓపెన్ అవుతుంది.
* 'యూజర్' నేమ్ ఎంటర్ చేసి 'Submit' చేస్తే మీ పాస్‌వర్డ్ మీ ఈమెయిల్ఐడీకీ చేరుతుంది.