close
eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

UPSC - Engineering Services Preparation Plan

జాతీయస్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, అసిస్టెంట్‌ ఇంజినీరు వంటి గ్రూపు-ఎ ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్‌సీ ఈ పరీక్ష నిర్వహిస్తోంది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది. ఇండియన్‌ రైల్వే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌, మిలిటరీ ఇంజినీరింగు, సెంట్రల్‌ వాటర్‌, సెంట్రల్‌ ఇంజినీరింగు, నావల్‌, సెంట్రల్‌ పవర్‌, టెలికామ్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీస్‌ వంటి వివిధ విభాగాల్లో దీనిద్వారా నియామకాలు జరుగుతాయి.
ఇంజినీరింగ్‌ పట్టభద్రులు అత్యున్నత సర్వీసుగా భావించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షలో గరిష్ఠంగా మార్కులు సాధించాలంటే ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి? పరీక్షకు ఎలా సిద్ధం కావాలో తెలుసుకోవాలంటే .... క్లిక్ చేయండి.
Engineering Services Exam Preparation Plan
ప్రణాళికాబద్ధమైన సన్నద్ధత ఐఈఎస్‌ పరీక్షకు ఎంతైనా అవసరం. ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచన అభ్యర్థికి ఉండాలి. రోజుకు 2 గంటలు జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఇంగ్లిష్‌కు, 6-8 గంటలు ఇంజినీరింగు సబ్జెక్టులకు కేటాయిస్తే విజయం తథ్యం. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సలహాలు తీసుకొంటూ ప్రామాణిక గ్రంథాలు చదవాలి.
ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాలకు సంబంధించి తయారీ విస్తృతంగా ఉండాలి. కన్వెన్షనల్‌కి సంబంధించి ఎంపిక చేసుకున్న అంశాలను కేంద్రీకృతంగా చదవాలి. యూపీఎస్‌సీ నిర్వహిస్తున్న సివిల్‌ సర్వీస్‌, ఫారెస్ట్‌ సర్వీస్‌ పరీక్షల పేపర్లను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు గేట్‌పాల్‌ పేపర్లు, ఇతర పబ్లిక్‌ సెక్టార్లలో అడిగిన ప్రశ్నలను సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Read More...

Back