Latest News

వీసా, పాస్‌పోర్టు సేవలు 21 నుంచి కొత్త సంస్థకు

* అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం పాస్‌పోర్టు, వీసా సంబంధిత సేవలన్నింటినీ పొరుగుసేవల కింద కొత్త కంపెనీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలోని భారత దౌత్య కార్యకలాపాలన్నింటికీ సేవలందిస్తున్న కంపెనీపై ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అమెరికాలో ఉన్న అన్ని భారత దౌత్య కార్యాలయాల్లోనూ సేవలందిస్తున్న బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ స్థానంలో కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను నియమించారు. ఈ సంస్థ ఈ నెల 21 నుంచి సేవలందిస్తుందని భారత దౌత్యకార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Ask the Expert
Click Here..