Latest News

అమెరికా వర్సిటీల్లో పెరిగిన భారత విద్యార్థులు

వాషింగ్టన్: చదువువకోవడానికి అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం అమెరికాలోని భారత విద్యార్థుల సంఖ్య 32 శాతం పెరిగిందని స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ విజిటింగ్ ప్రోగ్రామ్ (ఎస్ఈవీపీ) పేర్కొంది. అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు 9 శాతం పెరిగినట్లు ఎస్ఈవీపీ తెలిపింది. భారత్ తర్వాత 25.9 శాతం పెరుగుదలతో వియత్నాం రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇదిలా ఉండగా అమెరికాలో 3 లక్షల మంది చైనీయులు, 1.5 లక్షల మంది భారతీయులు చదువుకుంటున్నారు. అమెరికాలో అధికంగా విద్యార్థులున్న మొదటి 10 దేశాలు వరుసగా.. చైనా, భారత్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా, జపాన్, తైవాన్, వియత్నాం, మెక్సికో, బ్రెజిల్.

posted on 04.09.2015

Ask the Expert
Click Here..