Latest News

తెలుగు విద్యార్థులకు అండగా తానా

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ వర్సిటీ, నార్త్‌ వెస్ట్రన్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో చేరి సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులకు సాయం చెయ్యడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సిద్ధంగా ఉందని ఆ సంస్థ కార్య నిర్వాహక అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు. తానా డిసెంబరు 20న నిర్వహించిన ఇమ్మిగ్రేషన్‌ సదస్సుకు ముఖ్యఅతిథిగా వచ్చిన ఇమ్మిగ్రేషన్‌ అటార్నీ షీలా మూర్తి దృష్టికి తాజా సమస్యను తీసుకువెళ్లామని చెప్పారు. అమెరికాలోని భారత రాయబారి అరుణ్‌సింగ్‌ని, అమెరికా చట్ట సభల్లో సభ్యులని కూడా కలసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తానా అధ్యక్షుడు డాక్టర్‌ చౌదరి జంపాల తెలిపారు.

posted on 23.12.2015

Ask the Expert
Click Here..