Latest News

ఆ విద్యార్థులకు ఖర్చులివ్వండి

* సుష్మాకు ఎంపీ రాపోలు లేఖ
ఈనాడు, దిల్లీ: అమెరికాలో అధికారుల అమానవీయతకు గురై వెనక్కి వచ్చిన విద్యార్థులకు ఖర్చులు చెల్లించి ఆదుకోవాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు కాంగ్రెస్‌ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జనవరి 5న ఆయన లేఖ రాశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మానసిక వేదనతోపాటు ఆర్థికంగా దెబ్బతిన్నారని రాపోలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు వీసా రావడానికి, సురక్షితంగా ప్రయాణం చేసి విదేశీవిద్యను అభ్యసించడానికి సహకరించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు స్థానిక ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో అవగాహన, తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

posted on 06.01.2016

Ask the Expert
Click Here..