Latest News

అమెరికా వీసాలు, ఇక్కట్లపై 10న అవగాహన

* ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ వెల్లడి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: అమెరికా వెళ్లి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులకు సలహాలు అందించేందుకు ఈనెల 10న (ఆదివారం) గాంధీభవన్‌లోని ఇందిరాభవన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్‌, టీపీసీసీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు వినోద్‌కుమార్‌లు తెలిపారు. జనవరి 9న వారు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విద్యార్థులు అమెరికా వెళ్తున్న సమయంలో వీసాల జారీలో, అక్కడికి వెళ్లి ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నారని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో అమెరికాకు చెందిన న్యాయ నిపుణులు పాల్గొంటారని వెల్లడించారు.

posted on 10.01.2016

Ask the Expert
Click Here..