Latest News

విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక విభాగం

* రఘువీరా, భట్టి
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు అందించేందుకు కృషి చేస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఇందిరాభవన్‌లో ఏపీసీసీ, టీపీసీసీ, ఎన్‌ఆర్‌ఐ విభాగం, ఎన్‌ఎస్‌యూఐ సంయుక్తాధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఇటీవల ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు వీసాలు సరిగ్గాలేవని వెనుదిరిగి వచ్చారని, బాధిత విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన భరోసా ఇవ్వలేకపోయాయని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఆయా విద్యార్థులకు అవగాహన కల్పించి తగు విధంగా చేయూతనందిస్తుందన్నారు. సదస్సుకు హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాలను న్యాయనిపుణులు షాండిలర్‌ నివృత్తి చేశారు.

posted on 11.01.2016

Ask the Expert
Click Here..