Latest News

వీసా రుసుముల్ని పెంచిన అమెరికా

వాషింగ్టన్‌: అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్‌-1బి, ఎల్‌-1 వీసాల్లో కొన్ని విభాగాలకు రుసుములను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా భారత ఐ.టి. కంపెనీలపై ప్రభావం కనిపించనుంది. హెచ్‌-1బి వీసాల కోసం దరఖాస్తు చేసే కొన్ని విభాగాలవారు అదనపు రుసుముగా 4 వేల డాలర్లు (సుమారు రూ.2,60,000) చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది. ఎల్‌-1ఎ, ఎల్‌-1బి వీసాల్లో కొన్ని విభాగాల నిమిత్తం 4500 డాలర్లు (సుమారు రూ.2,92,500) అదనంగా జమ చేయాలని వివరించింది. ఇతర అన్ని రకాల రుసుములకు ఇవి అదనమని, 2025 సెప్టెంబరు 30 వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపింది.

posted on 13.01.2016

Ask the Expert
Click Here..