Latest News

భారత్‌కు నూతన వీసా సేవలు: బ్రిటన్‌ మంత్రి

దిల్లీ: భారతీయులకు నూతన వీసా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని బ్రిటన్‌ వలసల వ్యవహారాలశాఖ మంత్రి జేమ్స్‌ బ్రోకెన్‌షైర్‌ పేర్కొన్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన జేమ్స్‌ వివిధ వీసా సేవలను గురించి ప్రస్తావించారు. అదే రోజున వీసా గడువు పొడిగింపు, తొలి సారి బ్రిటన్‌ వచ్చే వారికి అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. బ్రిటన్‌లో పని, విద్య, పర్యటనలకు సంబంధించిన వీసాలను భారత్‌లో వేగంగా పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ఏడాదితో పోల్చితే భారత్‌ నుంచి పర్యాటక వీసాలు 17 శాతం పెరిగాయని ఆయన చెప్పారు. విజిట్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల చివర్లో నూతన ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.

posted on 17.02.2016

Ask the Expert
Click Here..