Latest News

భారత విద్యార్థులకు న్యూజిలాండ్ స్వాగతం

* వీసా నిబంధనల సరళీకరణ
పుణె: భారత విద్యార్థులకు న్యూజిలాండ్ ఘన స్వాగతం పలుకుతోంది. వెల్లింగ్టన్‌కు తరలివస్తున్న విదేశీ విద్యార్థులో రెండో స్థానం భారతీయులదేనని న్యూజిలాండ్ విద్య (ఈఎన్‌డ్) విభాగం వెల్లడించింది. మరింత మందిని ఆకర్షించేందుకు, విద్యాపరమైన గమ్యస్థానంగా దేశాన్ని మార్చేందుకు వలస, వీసా నిబంధనలను సరళీకరించినట్లు తెలిపింది. ముఖ్యంగా సైబర్ భద్రత, క్రీడల నిర్వహణ, యానిమేషన్ సైన్స్, హాస్పిటాలిటీ కోర్సుల్లో చేరేందుకు పెద్దయెత్తున విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారని ఈఎన్‌జడ్ ప్రాంతీయ డైరెక్టర్ జాన్ లాక్సన్ వెల్లడించారు. 'న్యూజిలాండ్ వలసల విభాగం(ఐఎన్‌జడ్) ఇటీవల విద్యార్థుల కోసం కొత్త వీసాలను కూడా ప్రవేశపెట్టింది. ఐదేళ్ల కాలపరిమితి ఉండే వీటిపై మూడు కోర్సుల్లో చేరే అవకాశముందిఅని ఆయన తెలిపారు. ఇంతకుముందు విద్యార్థులు మూడు కోర్సుల్లో చేరాలంటే మూడు వీసాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. 2014 గణాంకాల ప్రకారం 20,227 మంది భారత విద్యార్థులు ఇక్కడ చదువుతున్నట్లు ఐఎన్‌జడ్ ప్రాంతీయ మేనేజర్ నెతానియేల్ మాక్కీ తెలిపారు.

posted on 17.02.2016

Ask the Expert
Click Here..