Latest News

వార్షిక జీతం తక్కువ ఉంటే యూకే నుంచి బహిష్కరణే

లండన్‌: యూకేలో పనిచేసే విదేశీయుల్లో వార్షిక జీతం 35,000 పౌండ్లు (సుమారు రూ.33.40 లక్షలు) కంటే తక్కువ ఉన్నవారిని వారి మాతృదేశాలకు పంపించడానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలనుంచి అమల్లోకి రాబోతున్న నూతన చట్టం ప్రకారం... ఇలాంటివారు మాతృదేశానికి వెళ్లిపోకపోతే దేశ బహిష్కృతుల్ని చేస్తారు. యూకేలో పనిచేయడానికని వచ్చి, ఇక్కడే స్థిరపడిపోతున్నవారిని దృష్టిలో పెట్టుకుని 2012లోనే ఇలాంటి నిబంధనను రూపొందించారు. 2011 ఏప్రిల్‌ 6 తర్వాత యూకే చేరుకున్నవారికి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. టైర్‌-2 వీసాపై వచ్చేవారిలో ఎక్కువ మంది భారతీయులే. 2014-15లో ఇలాంటి 55,589 వీసాలను జారీ చేస్తే వీటిలో భారతీయులవే 31,058 ఉన్నాయి. కొత్త నిబంధనల వల్ల యూకేలో 40 వేల మంది భారతీయులకు ఇబ్బందిఎదురుకావచ్చని తెలుస్తోంది.

posted on 16.03.2016

Ask the Expert
Click Here..