Latest News
వాషింగ్టన్: అత్యధిక ప్రజాదరణ కలిగిన హెచ్1బీ ఉద్యోగ వీసా దరఖాస్తులను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమెరికా స్వీకరించనుంది. 2017 ఆర్థిక సంవత్సరానికిగాను గరిష్ఠంగా అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన 65,000 మందికి వీసాలు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వీసాలకు భారత సాంకేతిక నిపుణులు అత్యంత ప్రాధాన్యమిస్తుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాలు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంటి విభాగాల్లో మేలిమి నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను అమెరికా సంస్థలు ఈ వీసాల ద్వారానే ఎక్కువగా తమ దేశానికి రప్పించుకుంటాయి. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన వారి కోసం మొదటి 20వేల వీసాలను కేటాయిస్తారు. మొదటి ఐదు రోజుల్లోనే 65వేలకు మించి దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నట్లు అమెరికా పౌరసత్వం, వలసల విభాగం సేవలు(యూఎస్సీఐఎస్) ప్రకటనలో తెలిపింది. posted on 18.03.2016 |
|