Latest News

అంకుర వీసాలు ప్రవేశపెడతాం

* సాంకేతిక ఉన్నత విద్య అభ్యసించే విదేశీ విద్యార్థులకు గ్రీన్‌ కార్డులు ఇస్తాం
* డెమోక్రటిక్‌ నేత హిల్లరీ హామీల వెల్లువ

వాషింగ్టన్‌: ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు అంకుర వీసా (స్టార్టప్‌ వీసా)లను ప్రవేశపెడతామని హిల్లరీ క్లింటన్‌ హామీ ఇచ్చారు. అంతేకాదు ప్రముఖ విద్యా సంస్థల్లో శాస్త్ర, సాంకేతిక విభాగంలో మాస్టర్స్‌, పీహెచ్‌డీ చదివే విదేశీ విద్యార్థులకు గ్రీన్‌ కార్డులు అందిస్తామని చెప్పారు. డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖాయం చేసుకున్న ఆమె.. తాను దేశ అధ్యక్షురాలైతే శాస్త్ర సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో తీసుకురాబోయే మార్పుల అజెండాను విడుదల చేశారు. డెన్వర్‌లో ఈ విషయంపై ఆమె మాట్లాడారు. వలసల సమస్యను పరిష్కరించేందుకు గ్రీన్‌ కార్డు జారీ విధానాన్ని ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు. దీంతో పెద్దయెత్తున భారత విద్యార్థులు లబ్ధి పొందే వీలుంది. ఏటా లక్ష కంటే ఎక్కువ మంది భారత విద్యార్థులు వివిధ అమెరికా వర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు.

posted on 30.06.2016

Ask the Expert
Click Here..