Latest News

అమెరికాలో కొత్తగా 2,87,000 కొలువులు

వాషింగ్టన్‌: అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగవుతోందన్న సంకేతాలిస్తూ జూన్‌లో ఆ దేశంలో కొత్తగా 2,87,000 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. విశ్లేషకులు అంచనా వేసిన 1,12,000తో పోలిస్తే ఈ సంఖ్య బాగా ఎక్కువ కావడం గమనార్హం. మేలో కొత్త ఉద్యోగాల సృష్టి స్వల్పంగా నమోదు కావడంతో విధానకర్తలు ఒకింత ఆందోళనకు లోనయ్యారు. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయడానికి అదీ ఓ కారణమైంది. ఉద్యోగ గణాంకాలు వెలువడిన వెంటనే డాలరు బలపడింది.

posted on 09.07.2016

Ask the Expert
Click Here..