Latest News

మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.25 లక్షల సహాయం

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రం నుంచి విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలనుకునే మైనార్టీ విద్యార్థులకు రూ.25 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందించాలని, దీనికి సంబంధించి తమ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ షకీల్ చెప్పారు. బుధవారం శాసనసభ కమిటీ హాలులో మైనార్టీ సంక్షేమ కమిటీ సమావేశం జరిగింది. దీనికి సభ్యులు సలీం, అక్బరుద్దీన్ ఒవైసీ, ఫరుఖ్‌హుస్సేన్ తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం కమిటీ ఛైర్మన్ షకీల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం విదేశాలకు వెళ్లి విద్యనభ్యసించే మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం రూ.పది లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోందని, ఇది సరిపోవడం లేదన్నారు. మైనార్టీ విద్యార్ధులు పోటీపరీక్షలకు సిద్దమయ్యేందుకు జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు. దిల్లీలో ఉన్న మైనార్టీల శిక్షణ సంస్థల గురించి అధ్యయనం చేయడానికి తమ కమిటీ ఆగస్టు 9న దిల్లీకి వెళ్లనుందన్నారు. క్రైస్తవ సంస్థలకు చెందిన భూముల పరిరక్షణకు ప్రత్యేక వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.

posted on 21.07.2016

Ask the Expert
Click Here..