Latest News

వైద్యవిద్యకు ఆకర్షిస్తున్న 'బెలారస్‌'

* నాలుగేళ్ల వైద్యవిద్యకు కేవలం రూ.23 లక్షలు
విజయవాడ: భారత వైద్య విద్యార్థులను యూరప్‌కు ఆకర్షిస్తున్న దేశాల్లో బెలారస్‌ మొదటి స్థానంలో ఉందని గోమెల్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ డీన్‌ మరియానా జులై 20న‌ అన్నారు. విజయవాడ పర్యటనకు వచ్చిన ఆమె విదేశాల్లో వైద్య విద్యపై ప్రస్తావించారు. ప్రస్తుతం వైద్యవిద్య అభ్యసించే భారత విద్యార్థులు ఫిలిప్ఫీన్స్‌, ఉక్రెయిన్‌ లాంటి దేశాలకు వెళ్తున్నారని తెలిపారు. మెడికల్‌ డిగ్రీ పూర్తయిన తర్వాత భారతీయ వైద్య మండలి నిర్వహించే ప్రత్యేక పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు బెలారస్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ .. భారత విద్యార్థులకు కావాల్సిన పరిజ్ఞానాన్ని అందించే విషయంలో సహకరిస్తుందన్నారు. బెలారస్‌లో నాలుగేళ్ల వైద్యవిద్యను కేవలం రూ.23లక్షల్లోనే పూర్తి చేయొచ్చని చెప్పారు.

posted on 21.07.2016

Ask the Expert
Click Here..