Latest News

ఆస్ట్రేలియా వృత్తివిద్యా సంస్థల్లోకి భారతీయులను ఆహ్వానించాలి

మెల్బోర్న్‌: ఆస్ట్రేలియా వృత్తి విద్యా సంస్థల్లోకి పెద్ద సంఖ్యలో భారతీయులను ఆహ్వానించాలని న్యూసౌత్‌వేల్స్‌ (ఎన్‌ఎస్‌డబ్ల్యూ) రాజకీయ నాయకుడు ఒకరు సూచించారు. యాభై కోట్ల ప్రజలకు నైపుణ్యాలు కల్పించే లక్ష్యాన్ని అధిగమించేందుకు భారత్‌.. ప్రపంచం వైపు సాయం కోసం చూస్తోందని ఎన్‌ఎస్‌డబ్ల్యూ లేబర్‌ పార్టీ నేత ఫోలే వ్యాఖ్యానించారు. "నైపుణ్యాలు కల్పించే కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు టీఏఎఫ్‌ఈ (సాంకేతిక, ఉన్నత విద్య) ఎన్‌ఎస్‌డబ్ల్యూకి కూడా అవకాశం ఉంది. రానున్న సంవత్సరాల్లో వేల సంఖ్యలో భారత విద్యార్థులకు మనం శిక్షణ కల్పించాలి" అని ఫోలే పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌డబ్ల్యూలో భారత విద్యార్థులు పెద్దమొత్తంలో ఉన్నారు. ఇక్కడున్న పెద్ద విదేశీ విద్యార్థుల సమూహాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

posted on 26.6.2015

Ask the Expert
Click Here..