Latest News

పేర్ల నమోదుకు ప్రత్యేక గవాక్షం

* విదేశాల్లో చదివే విద్యార్థులూ... రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలిక
ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు మోసపోకుండా చూసేందుకు, వారి సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. పేర్ల నమోదుకు ప్రత్యేక గవాక్షం(పోర్టల్‌) రూపొందించింది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు తమ పేర్లను విదేశీ వ్యవహారాల శాఖలోని madad పోర్టల్‌(కాన్సులర్‌ సర్వీసెస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌)లో నమోదు చేసుకోవాలని ఆ శాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్వర్‌ కోరారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. పేర్లను నమోదు చేసుకున్న వారికి ఆయా కోర్సులు, మైగ్రేషన్‌ తదితర సమస్త సమాచారాన్ని పంపిస్తామని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో వివిధ దేశాల్లో గుర్తింపున్న విద్యాసంస్థల సమాచారాన్ని కూడా ఫేస్‌బుక్‌ పేజెస్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ స్టూడెంట్‌ అసోసియేషన్స్‌ తదితర లింకుల ద్వారా అందిస్తామని ఆయన లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులు తాము ఎదుర్కొనే సమస్యలను కూడా ఈ పోర్టల్‌లో ప్రస్తావించవచ్చన్నారు.

posted on 12.08.2016

Ask the Expert
Click Here..