Latest News

విదేశీ ఉద్యోగుల వేతనస్థాయిని పెంచనున్న సింగపూర్‌

సింగపూర్: విదేశీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులను... తమతో పాటే జీవించేలా సింగపూర్‌కు రప్పించుకోవాలంటే... సదరు ఉద్యోగులకు ఉండాల్సిన కనీస వేతన స్థాయిని ఆ దేశ ప్రభుత్వం పెంచనుంది. ప్రస్తుతం ఉద్యోగుల కనీస నెలసరి వేతనం సుమారు రూ.1,86,000 (నాలుగు వేల సింగపూర్‌ డాలర్లు) ఉంటే సింగపూర్‌లో వారి భార్య, పిల్లలకు డిపెండెంట్‌ పాస్‌లను అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని సుమారు రూ.2,33,000 (ఐదు వేల సింగపూర్‌ డాలర్లు)కు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

posted on 23.7.2015

Ask the Expert
Click Here..