Latest News

ఆస్ట్రేలియాతో విద్యారంగంలో భాగస్వామ్యం

న్యూదిల్లీ: భారత్‌, ఆస్ట్రేలియా మధ్య విద్యారంగంలో సంబంధాలను బలోపేతం చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉన్నత విద్య, పరిశోధనలో రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుందని ప్రభుత్వం వెలువరించిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఉభయ దేశాల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. సంయుక్తంగా డిగ్రీలు ప్రదానం చేయడానికి, సంయుక్తంగా పరిశోధనలు చేయడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. సబ్జెక్టు నిపుణులు, అధ్యాపకులు, విద్యారంగ నిర్వాహకులకు వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి దోహదం చేస్తుంది.

posted on 21.8.2015

Ask the Expert
Click Here..