సాధన చేయి... విజయం నీదేనోయి
ఇంటరు విద్యార్థులకు 'ఈనాడు - మీతోడు'
సందేహాలను నివృత్తి చేసిన పాఠ్యాంశాల నిపుణులు

పాఠ్యాంశాలపై పట్టు సాధించడం, సమస్యలపై సాధన చేయడం ద్వారా ఇంటర్మీడియట్ పరీక్షల్లో విజయాలను నమోదు చేయవచ్చని పాఠ్యాంశాల నిపుణులు సూచిస్తున్నారు. అకాడమీ పాఠ్యపుస్తకాలను అభ్యసనం చేస్తూ ఉత్తీర్ణతలో ఉన్నత స్థానంలో నిలవవచ్చని చెబుతున్నారు. ప్రథమ ఇంటర్ విద్యార్థులకు ఈ నెల 12 నుంచి, ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు 13 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొనడం సహజమే. ఏడాదిపాటు పాఠ్యాంశాలను చదివినా సందేహాలు వారి మెదళ్లను తొలుస్తూనే ఉంటాయి. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేలా, పరీక్షలంటే వారిలో నెలకొన్న భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసం నింపేలా 'ఈనాడు సంకల్పించింది. ఫోన్ ద్వారా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు పాఠ్యాంశాల నిపుణులు సమాధానాలిచ్చే 'ఈనాడు - మీతోడు కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు ప్రథమ ఇంటర్ గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, ఆంగ్లం పాఠ్యాంశాల్లో ఆయా పాఠ్యాంశాల నిపుణులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. - గుంటూరువిద్య, న్యూస్‌టుడే బృందం

జంతుశాస్త్రంలో పటాలు కీలకం

- షేక్.జహీర్‌బాషా, జంతుశాస్త్రం అధ్యాపకులు, శ్రీచైతన్య కళాశాల

ప్రశ్న: ఇంటర్ మొదటి సంవత్సరం జంతుశాస్త్రం కష్టంగా ఉంది, ఉత్తీర్ణత సాధించాలంటే ఎలా చదవాలి?
- యశ్వంత్, నరసరావుపేట

Read More..

సమీకరణాల సాధనతో విజయం

- సీహెచ్ నరసింహారావు, రసాయన శాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల

ప్రశ్న: ఏఏ పాఠ్యాంశాలలో సమస్యాత్మక (న్యూమెరికల్స్) ప్రశ్నలు వస్తాయి?
- అనుదీప్, (హైదరాబాద్), మానస్వి, రాజీవ్ (గుంటూరు)

Read More..

ఆందోళన వీడితే గణితం సులువు

- కె.సాంబశివరావు, గణితం విభాగాధిపతి, ఎన్ఆర్ఐ అకాడమీ

గణితం 1-ఎ

ప్రశ్న: స్వల్ప సమాధాన (2 మార్కుల) ప్రశ్నలు ఏఏ పాఠ్యాంశాల నుంచి ఎక్కువగా వస్తాయి. ముఖ్యమైన పాఠ్యాంశాలేవి?

Read More..

సమగ్రంగా చదివితేనే వృక్షశాస్త్రంలోమంచి మార్కులు

- బోయపాటి హనుమంతరావు (అధ్యాపకుడు, భాష్యం మెడెక్స్)

ప్రశ్న: ఏ పాఠ్యాంశాల నుంచి వ్యాసరూప, లఘు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది?
- చంద్రిక, విద్యానగర్(మొదటి ఇంటర్)

Read More..

విషయ పరిజ్ఞానం, వ్యక్తీకరణ ముఖ్యం

- నూతలపాటి అరవింద్, ఆంగ్ల అధ్యాపకుడు, శ్రీమాజేటి గురవయ్య కళాశా

ప్రశ్న: యానిటేషన్స్, ప్యారాగ్రాఫ్ ఆన్సర్స్ ఎలా రాయాలి, ఏఏ పాఠ్యాంశాలు చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి.

Read More..

దృష్టి పెడితే భౌతికశాస్త్రం కష్టం కాదు

- ఎన్.కె.ఎస్.నాగభూషణరెడ్డి, ఎన్.ఆర్.ఐ. అకాడమి సీనియర్ అధ్యాపకులు, ఫిజిక్స్

ప్రశ్న: మొదటి ఏడాది భౌతికశాస్త్రంలో ఎలాంటి లెక్కలు(ప్రాబ్లమ్స్) పరీక్షల్లో ఇచ్చే అవకాశం ఉంది.

Read More..